FbTelugu

కుటుంబసభ్యులే దారుణ హత్యకు తెగబడ్డారు

విశాఖపట్నం: నగరంలోని అక్కయ్యపాలెం దరి రామచంద్ర నగర్ లో శనివారం రాత్రి స్వంత కుటుంబ సభ్యులే ఒకరిని దారుణంగా హత్య చేశారు.

10 నుండి 10.30 గం. ల. మధ్య ప్రాంతంలో హత్య జరిగినట్లుగా తెలుస్తోంది.
కస్తూరి అశోక్ వర్మ (29) అనే వ్యక్తిను అతని తల్లీ కస్తూరి వరలక్ష్మి, అక్క శ్రీదేవి, బావ వెంకటేశ్వర రాజు, ముగ్గురు కలిసి హత్య చేసినట్లు నాలగవ పట్టణ పోలీసులుకు ఫిర్యాదు వచ్చింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. హత్యపై స్థానికులు, ఇంటిలో ఉన్నవారిని విచారించి, హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు.

You might also like