FbTelugu

అద్దె అడిగాడని.. కత్తితో పొడిచి హత్య

చెన్నై: అద్దె అడిగాడని ఇంటి యజమానిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై లో గుణశేఖర్ అనే వ్యక్తికి చెందిన ఇంట్లో.. ధనరాజ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో అద్దెకు ఉన్నాడు.. కాగా దేశంలో లాక్ డౌన్ కారణంగా.. అతడు గత నాలుగు నెలలుగా ఇంటి అద్దె చెల్లించడం లేదు.

ఈ విషయంపై ఇరువురి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ధనరాజ్ కొడుకు గుణశేఖర్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన గుణ శేఖర్ అక్కడి కక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.