FbTelugu

ఆరేళ్ల బాలికను గొంతుకోసి హత్య

మేడ్చల్: ఆరేళ్ల బాలికను అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన జిల్లాలోని పోచారంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కల్యాణ్, అనూష దంపతుల కుమార్తె ఆద్య(6). కాగా పోచారంలో స్థానిక ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారిహోమ్స్ లో ఆద్య ను ఓ కిరాతకుడు సర్జికల్ కత్తితో అతి దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు.

ఈ హత్యను కరుణాకర్ (నిందితుడు) అనే వ్యక్తి బాలిక తల్లిదండ్రులపై ఉన్న కోపంతో ఆ బాలికను హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కల్యాణ్ దంపతులకు కరుణాకర్ పరిచయస్తుడేనని విచారణలో తేలినట్టు పోలీసులు తెలిపారు.

You might also like