FbTelugu

ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లోనే పూడ్చేసింది…

గుంటూరు: అక్రమ సంబంధాలకు అలవాటు పడిన కొందరు మహిళలు బరితెగించి పోతున్నారు. తన కుమారుడు మూడు నెలలుగా కన్పించడం లేదని తండ్రి ఫిర్యాదు చేయగా మొత్తం విషయం బట్టబయలు అయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండల కేంద్రంలో నివసిస్తున్న బల్లెపల్లి సుబ్బారావు తన కుమారుడు చిరంజీవి ఆచూకి కనుక్కోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలియడం తో అక్కడికి వెళ్లి ఆరా తీశారు. విచారించేందుకు స్టేషన్ కు పిలిపించగా నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడించింది.

ప్రియుడుతో కలిసి ఇంట్లోనే భర్త శవాన్ని పూడ్చివేసినట్లు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. ఆ తరువాత ఇంటికి తాళం వేసి కొల్లూరులో ప్రియునితో ఉంటున్నట్లు తెలిపింది. చిరంజీవి మొదట ఒక మహిళను వివాహం చేసుకోగా ఆమెతో వివాదం కారణంగా కేసు నడుస్తోంది. ఆ తరువాత ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకోగా కుమారుడు జన్మించాడు. ఈ సమయంలో కొల్లూరు కు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.

ఇటీవల ఒక భూమి విక్రయించగా రూ.20 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లో బీరువాలో భద్రపరిచాడు. ఇంట్లో డబ్బులు ఉండగానే భర్త చిరంజీవిని ప్రియుడితో కలసి హత్య చేసి, ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. ఆ తరువాత నింపాదిగా కొల్లూరు వెళ్లి సహజీవనం చేస్తున్నది.

You might also like