FbTelugu

అల్లుడి తలతోనే పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు

తూర్పుగోదావరి: ఓవ్యక్తి తన అల్లుడి తలనరికి పోలీస్ స్టేషన్ కు అదే తలను తీసుకెళ్లి లొంగిపోయారు. ఈ దారుణ ఘటన జిల్లాలోని రౌతులపూడి మండలం, డీజేపురంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వరరావు అనే వ్యక్తి తన అల్లుడైన లక్ష్మణ్(30)ను తల నరికి అదే తలతో అన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగి పోయాడు. అయితే అతడు హత్య చేయడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like