FbTelugu

దారుణం… ఫ్రిజ్ లో మృతదేహం!

హైదరాబాద్: నగరంలో నేరగాళ్లు కొత్త కొత్త విధానాలతో మర్డర్లు చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. జుబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక టైలర్ ను చంపేసి, ఆ తరువాత అతని ఇంట్లోని ఫ్రిజ్ లో దాచిపెట్టారు.

జుబ్లిహిల్స్ పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ లో మహ్మద్ సిద్దిక్ (35) టైలరింగ్ పనులు చేసుకుంటాడు. వ్యక్తిగత కక్షలో మరే ఇతర కారణాలో తెలియదు కాని గుర్తు తెలియని వ్యక్తలు సిద్దిక్ ను దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత అతడి ఇంట్లోని ఫ్రిజ్ లో శవాన్ని సంచిలో కుక్కి పెట్టారు. ఇరుగుపొరుగు వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.