FbTelugu

సినిమా చూపిస్తాం త‌మ్ముళ్లూ!

నిజంగానే తెలుగుదేశం కేడ‌ర్‌కు ఏపీలో సినిమా క‌నిపిస్తుంది. వైసీపీ నేత‌లు ఇది కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే అంటున్నా త‌మ్ముళ్లు మాత్రం ఇది సినిమా స్కోప్ అనేంత‌గా చేరింది.

మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు ఎవ్వ‌ర్నీ వ‌ద‌ల‌కుండా మ‌రీ కేసులు, జైళ్లంటూ ఏపీ స‌ర్కారు క‌సి తీర్చుకునేందుకు వేట సాగిస్తుంది. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. మంత్రి కొడాలి నాని మ‌రో అడుగు ముందుకేసి.. అచ్చెన్నా నువ్వు అప్రూవ‌ర్‌గా మారిపో.. ఇదంతా పెద‌బాబు, చిన‌బాబు చేయించారంటూ ఒప్పుకో.. నీకు క‌నీసం శిక్ష అయినా త‌గ్గుతుందంటూ సూచ‌న‌లు చేస్తున్నారు.

ప‌ల్నాడులోని గుర‌జాల ఎమ్మెల్యే కాసు మ‌హేశ్‌రెడ్డి అయితే.. ఇది ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా ముందు ఉంది చూడ‌మంటూ మ‌రీ హెచ్చరిక‌లు జారీచేశాడు. ఇవ‌న్నీ చూస్తుంటే త‌మ్ముళ్ల‌లో తెలియ‌ని వ‌ణ‌కు కూడా మొద‌లైంద‌ట‌. మాజీ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు, మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా క‌ప్పుకోబుతున్నా రంటూ తెగ ప్ర‌చారం కూడా సాగుతుంది. ఈ నెల 19న ఎంత మంది ఉంటారో చంద్ర‌బాబు తేల్చుకోవాలంటూ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ట్వీట్ కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌రో వైపు వైసీపీ న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు విసురుతున్న విమ‌ర్శ‌ల బాణాలు వైసీపీ కేడ‌ర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నాయ‌ట‌. ఎమ్మెల్యే ప్ర‌సాద‌రాజుతో ఉన్న అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డ‌టంతో ర‌ఘురాముడు మ‌రింత రెచ్చిపోతున్నాడు. మాది చిన్న‌కులం తంపీలు పెట్టొద్దు సారూ.. అంటూ వేడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా.. పందులే గుంపులుగా వ‌స్తాయి.. సింహం సింగిల్‌గా వ‌స్తుంద‌టూ మ‌రో అస్త్రం విసిరాడు.

ద‌మ్ముంటే జ‌గ‌న్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపమంటూ ప్ర‌సాద‌రాజుకు స‌వాల్ కూడా విసిరాడు. ఇంత‌కీ ఆయ‌న బీజేపీలోకి చేర‌బోతున్నాడా! లేదా ! అనేది తేల‌లేదు. తాను మాత్రం జ‌గ‌న్ అనుచ‌రుడ‌ని అంటూనే వైసీపీని టార్గెట్ గా చేసుకున్నాడు. ఈ లెక్క‌న‌ ఈ ఎంపీ గారికి కూడా త్వ‌ర‌లో చ‌ర్య‌లు ఉండ‌వ‌చ్చంటున్నారు వైసీపీ శ్రేణులు. ఇంటా.. బ‌య‌టా ద‌డ‌ద‌డ లాడిస్తున్న జ‌గ‌న్ మోహ‌నుడి చాణ‌క్య‌నీతి.. మున్ముందు ఇంకెంత‌గా వేడెక్కిస్తుంద‌నేది త‌మ్ముళ్ల గుబులుకు అస‌లు కార‌ణ‌మ‌ట‌.

You might also like