కామారెడ్డి: బావ, మరదలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయం అయింది. వివాహం ఇష్టం లేని యువతి, ఆమెబావ ఇద్దరూ విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వేరే పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.