FbTelugu

ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు

విజయవాడ: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

దీంతో ఇంద్రకీలాద్రిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. మౌనస్వామి కొండవద్ద కొండచరియలు విరిగిపడుతుండడంతో భక్తులు భయంలో పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. అధికారులు కేవలం ఒక హెచ్చరిక బోర్డు మాత్రమే పెట్టారని, ఫెన్సింగ్ లాంటి ఏర్పాటు ఏమీ చేయలేదని భక్తులు వాపోతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.