FbTelugu

బీజేపీ పై విరుచుకుపడ్డ సుబ్రహ్మణ్యస్వామి

న్యూఢిల్లీ: బీజేపీ కేంద్ర నాయకత్వంపై ఆ పార్టీ ఎంపీ, న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి విరుచుకుపడ్డారు. అయినవారికి ఒక న్యాయం కానివారికి మరో అన్యాయమా అని ఆయన మండిపడ్డారు.

ఆయనకు నచ్చకపోతే ఎవరినైనా సరే విమర్శిస్తారు. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను బీజేపీ ప్రకటించింది. శ్రీధరన్ వయస్సు 89 కాగా, ఆయనను ఎలా ప్రకటిస్తారని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్న లేవనెత్తారు. పార్టీ నిబంధనల ప్రకారం 75 సంవత్సరాలు దాటితే పదవులు ఇవ్వకూడదని ఉందని ఆయన గుర్తు చేశారు. 2024 లో ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్ లు కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ట్వీట్ చేయడం వివాదంగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.