FbTelugu

రాత్రి 9.30 కాదు 10 గంటలకు ప్రసారం…

హైదరాబాద్: ఇప్పటికే పన్నెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్-4 రియాల్టీ షో లో కొన్ని మార్పులు చేశారు.

హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో కు క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు వారాల్లో షో ముగియనున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న స్టార్ మా టీవీ ఛానల్ సంచలన నిర్ణయం తీసుకున్నది. వారంలో సోమవారం నాడు మొదలై శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9.30 కు రియల్టీ షో ప్రసారం చేస్తున్నారు. శనివారం, ఆదివారం మాత్రం 9 గంటలకే ప్రసారం చేస్తూ వస్తున్నారు. అలా కాకుండా ఇక నుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం ప్రారంభించాలని నిర్ణయించారు. శని, ఆదివారాలు మాత్రం ఎప్పటిమాదిరే ప్రసారం చేస్తారు. కొత్త సీరియల్ వదినమ్మ కోసం కార్యక్రమంలో మార్పులు చేసినట్లు స్టార్ మా టీవీ యాజమన్యం ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.