FbTelugu

హమ్మయ్య… సూపర్ న్యూస్ చెప్పారు!

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ప్రయోగ ఫలితం 90 శాతం మందిలో ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని బ్రిటీష్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాంకాక్ తెలిపారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి, అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మూడు దశల్లో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందని హాంకాక్ వెల్లడించారు. ఈ ప్రయోగాలను ధృవీకరిస్తే ప్రపంచ ప్రజలకు శుభవార్త అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలు వ్యాధి బారిన పడకుండా నివారించడంతో పాటు విస్తృతిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల కోసం 100 మిలియన్ డోసులు కావాలని అగ్రిమెంట్ చేసుకున్నామని, అనుకున్నట్లుగా సాగితే కొత్త సంవత్సరంలో ఎక్కువ మందికి అందచేస్తామని మాట్ హాంకాక్ హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.