FbTelugu

బ్రిటన్ ప్రధాని రెండోసారి పర్యటన రద్దు

న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండోసారి తన భారత పర్యటన రద్దు చేసుకున్నారు. భారతదేశంలో ప్రధానంగా ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే.

షెడ్యూలు ప్రకారం ఈ నెల 26న భారత్ రావాల్సి ఉండగా రావడం లేదని డౌనింగ్ స్ట్రీట్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి నేపథ్యంలో బోరిస్ జాన్సన్ వచ్చేవారం భారత్ లో పర్యటించడం లేదని తెలిపింది. బ్రెగ్జిట్ షాక్ నుంచి బ్రిటన్ ఆర్థికంగా పుంజుకోవాలంటే బలమైన వ్యాపార భాగస్వాములు ఉండాలి. చైనా మార్కెట్ ఉన్నా రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. అతిపెద్ద విపణిగా పేరున్న భారత్ బ్రిటన్ లో అతి పెద్ద పెట్టుబడిదారుగా అవతరించింది. 850కి పైగా కంపెనీలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.