FbTelugu

 బ్రిటన్ లో చెలరేగుతున్న డెల్టా వేరియంట్

లండన్: బ్రిటన్ లో డెల్టా వైరస్ వేరియంట్ ఉధృతి కొనసాగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 35,204 ఈ వేరియంట్ బారిన పడి అల్లాడిపోతున్నారు. దేశం మొత్తంగా ఈ రకం కేసులు 1,11,157కు చేరుకున్నాయి.

డెల్టా వేరియంట్ రకం తొలుత భారత దేశంలో గుర్తించగా, ఆ తరువాత విదేశాలకు వ్యాప్తించిన విషయం తెలిసిందే. కేవలం వారం రోజుల వ్యవధిలో 46శాతం కేసుల పెరుగుదల ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని యుకె హెల్త్ ప్రొటక్షన్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెన్ని హ్యారిస్ తెలిపారు. ఈ రకం వైరస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం లేదు, డబుల్ డోసు వ్యాక్సిన్లు అందరికీ ఇచ్చినట్లు తెలిపారు. అయినా పూర్తి రక్షణ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లాంబ్డా రకం వైరస్ కేసులు కూడా ఆరు నమోదు అయ్యాయన్నారు. ఈ వేరియంట్ తొలు పేరూ దేశంలో గుర్తించగా, 26 దేశాలకు పాకిందని హ్యారిస్ వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.