FbTelugu

తెలంగాణలో బ్రిటన్ స్ట్రెయిన్ ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బ్రిటన్ స్ట్రెయిన్ ఎంటర్ అయ్యిందా ? అంటే అవుననే విధంగా పరిస్థితులు ఉన్నాయి. స్ట్రెయిన్ వైరస్ రాష్ట్రంలో విస్తరిస్తే కలిగే పరిణామాలపై ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

బ్రిటన్ నుంచి వచ్చిన వారు, వయా యూకే మీదుగా వచ్చిన వారు సమారు 1200 మంది ప్రయాణీకుల వరకు ఉన్నారు. వారిలో 150 మంది కి పైగా ప్రయాణీకుల ఆచూకీ లభ్యం కావడం లేదు. మిగతా వారందరి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారు. పాజిటివ్ వచ్చిన వారి నుంచి సేకరించిన 20 నమూనాల్లో తేడాలు కన్పించడంతో వాటిని సీసీఎంబీ సంస్థ ఆ 20 మంది నమూనాలను జీన్ మ్యాప్ రిపోర్ట్ లను కేంద్రానికి పంపించింది. ఆ రిపోర్ట్ ల మీద రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన చెందుతోంది. ఎలా వస్తుందోనంటూ ఉత్కంఠకు గురవుతున్నారు.

ఈ 20 నమూనాలపై నేడో రేపో కేంద్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ స్ట్రెయిన్ వైరస్ ప్రవేశించిందని ప్రకటిస్తే ఏం చేయాలి, ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే దానిపై వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే సంసిద్ధమైనట్లు తెలిసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.