FbTelugu

సీఎం ప్రారంభించిన నెలకే.. కొట్టుకుపోయిన బ్రిడ్జీ

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ గత నెలలోనే ప్రారంభించిన ఓ బ్రిడ్జీ వరద తాకిడికి తునాతునకలై కొట్టుకుపోయింది. వివరాల్లోకెళితే.. బీహార్ లోని గండక్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని గత నెలలోనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు.

కాగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు పెరగడంతో సీఎం ప్రారంభించిన బ్రిడ్జీ నెలరోజులకే కొట్టుకుపోయింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన బ్రిడ్జీని ఇంత నాసీరకంగా నిర్మిస్తారా అంటూ.. అక్కడి స్థానికులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

You might also like