FbTelugu

దారుణ హత్యకు గురైన నవవధువు

* భర్తపైనే అనుమానం
ముంబై : పెళ్లైన నెలరోజులకే ఓ నవవధువు దారుణ హత్యకు గురైన ఘటన మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లా, వ‌సాయ్ ఏరియా, తులింజ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాల్ఘన్ జిల్లాకు చెందిన ఓ యువకుడు(24), యువతి(28) గత నెలలో వివాహం చేసుకున్నారు. కాగా నిన్న రాత్రి సదరు యువతి అతిదారుణంగా హత్యకు గురైంది.

ఈ ఘటనపై మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో యువతి భర్తే హతమార్చినట్టుగా పేర్కొన్నాడు. పెండ్ల‌యిన కొన్ని రోజుల‌ నుండే వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జరుగుతున్నాయని, భర్తే హత్య చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం యువతి భర్త పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.