FbTelugu

పతంజలి కరోనా మందుకు కేంద్రం బ్రేక్

ఢిల్లీ: యోగా గురువు రామ్ దేవ్ బాబా ఆధ్వర్యంలోని పతంజలి రూపొందించిన కొరోనిల్ ఆయుర్వేద మందుకు కేంద్రం షాకిచ్చింది.

ఇవాళ మధ్యాహ్నం కొరోనిల్ కిట్ ను రామ్ దేవ్ బాబా ఆవిష్కరించారు. గంటల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఈ మందుపై కీలక ప్రకటన చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మందుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలిని ఆదేశించింది. ఈ మందుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం చట్ట విరుద్దమని స్పష్టం చేసింది. ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను తెలియచేయకుండా ఆవిష్కరించారని పేర్కొంది. దీనిపై ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారు, ఈ మందు వేటితో తయారైంది, శాంపిల్ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

You might also like