FbTelugu

రెండు రోజులు వ్యాక్సినేషన్ కు బ్రేక్

హైదరాబాద్: వ్యాక్సిన్ల కొరత, వైద్య సిబ్బందిపై పనిభారం, కోవిషీల్డ్ తొలి డోస్ తరువాత ఎక్కువ రోజులు నిర్థారించడంతో రాష్ట్రంలో ఇవాళ రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదటి రెండు డోస్ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి డోసు వేసిన తరువాత సమర్థవంతంగా పనిచేస్తుండడంతో రెండో డోసు వాయిదా సమయాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో ప్రారంభించిన సెకండ్ డోస్ స్పెషల్ డ్రైవ్ను నిలిపివేస్తున్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న వారు 12 నుంచి 16 వారాల మధ్య మాత్రమే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అత్యధిక శాతం కొవిషీల్డ్ తీసుకున్న నేపథ్యంలో… రెండో డోస్ డ్రైవ్ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రెండో డోసు కోసం స్లాట్ బుక్ చేసుకున్నవారికి రద్దు చేస్తూ, 12 వారాల తరువాతే రావాలంటూ మెస్సేజీలు పంపించింది కూడా. సోమవారం నుంచి తిరిగి వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.