FbTelugu

సచిన్, లతా పై విచారణకు బ్రేక్

ముంబయి: రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన ప్రముఖుల విషయంలో బీజేపీ ఐటీ సెల్ పాత్రను విచారిస్తామని చెప్పామని, లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ ట్వీట్లపై కాదని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ స్పష్టం చేశారు.
నిద్రహారాలు మాని రైతులు న్యూఢిల్లీలో దీక్షలు చేస్తుండగా, వారి ఉద్యమం నీరు కారే విధంగా ప్రముఖులు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతిస్తూ ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్, క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా రైతులకు వ్యతిరేకంగా, బీజేపీకి మద్ధతుగా ట్వీట్ చేయడం దుమారం రేపింది. ఈ ట్వీట్లపై దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.

మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వం కూడా ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ ఈ ట్వీట్లపై విచారణ జరుపుతున్నట్లు ప్రకటించారు. అందరివి ఒకే రకంగా ఉన్నాయని, దీని వెనకాల బీజేపీ ఐటీ సెల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. ట్వీట్ల రూపకల్పనలో 12 మంది పాత్ర ఉందని ఆయన వివరించారు. లతా మంగేష్కర్, సచిన్ టెండుల్కర్ లను విచారిస్తామని మీడియాలో రావడంతో అనిల్ దేశ్ ముఖ్ ఇవాళ వివరణ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.