FbTelugu

ఇంటింటికి రేషన్‌ పథకానికి బ్రేక్

హైదరాబాద్: వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఇంటింటికి రేషన్‌కు బ్రేక్ పడింది. ఎండియూల ఆకస్మిక సమ్మెతో రేషన్ పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం దిగి వచ్చేవరకు విధులకు హాజరు కాబోమని స్పష్టం చేయడంతో సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేదు.
ఇటీవల ఎండియూ లకు సరుకు ఇచ్చే క్రమంలో కరోనా సోకి విజయవాడలోనే ముగ్గురు డీలర్లు మృతి చెందారు. ఎండియూ లతో పని చేయించలేక డిపోల్లో పంపిణీ చేయాలని మండలస్థాయి అధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మండల అధికారుల తీరుతో రేషన్ డిపోలు కరోనా కేంద్రాలుగా మారతాయని రేషన్ డీలర్లు పంపిణీపై భయపడి వెనకంజ వేశారు. మూడ్రోజులుగా పంపిణీ ఆగిపోయినా పౌర సరఫరాల శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నది. వ్యాక్సిన్, ఇతర డిమాండ్లు అమలు చేసేవరకు ఎండియూలు విధులకు రామంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.