FbTelugu

సచివాలయ భవనాల కూల్చివేతకు బ్రేక్

హైదరాబాద్: సచివాలయ భవనాల కూల్చివేత పనులను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం వరకు కూల్చివేత పనులు చేపట్టొద్దంటూ.. హైకోర్టు ఇచ్చిన అదేశాల మేరకు సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కాగా ట్రాఫిక్ ఆంక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా.. మరోవైపు హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలంటూ కోరాడు. ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఇప్పటికే సచివాలయ భవనాల కూల్చివేత 50 శాతం పూర్తైనట్టు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.