FbTelugu

ఆశ్చర్యపరిచేలా బొమ్మగీసిన బ్రహ్మానందం

హైదరాబాద్: హాస్యనటుడు బ్రహ్మానందం గొప్ప నటుడే కాకుండ మంచి చిత్రకారుడు అనే విషయం చాలా మందికి తెలిసిన విషయమే. తాజాగా బ్రహ్మానందం వేసిన ఓ డ్రాయింగ్ చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వేంకటేశ్వరస్వామి చిత్రం గీసి తనలోని కళా నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు.

బ్రహ్మానందం గతంలో ఆంజనేయస్వామి, గాంధీజీ బొమ్మలను సైతం గీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా బ్రహ్మానందం గీసిన వెంకటేశ్వర స్వామి ఆర్ట్ చూస్తే అచ్చం స్వామివారే దిగివచ్చినట్లుగా అనిపిస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.