FbTelugu

బ్రహ్మానందం కామెడీ చేయలేదు

తెలంగాణ దేవుడు’ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం. అందులో భాగంగా ఆయన తాజాగా ఓ వీడియో షేర్ చేశారు. కేసిఆర్ బయోపిక్ గా ‘తెలంగాణ దేవుడు’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించారు. కొంత కాలంగా సినిమాలు చేయడం తగ్గించేసిన బ్రహ్మానందం కూడా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో కామెడీ రోల్ కాకుండా ఒక డిఫరెంట్ పాత్రని చేసినట్టు చెప్పారు. ‘తెలంగాణ దేవుడు’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బ్రహ్మానందం ఇచ్చిన వీడియోలో ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి మాట్లాడారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ.. డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారు. చాలా మంచి దర్శకుడు అని అన్నారు. నా పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇందులో నేను కామెడీ చేయలేదు. కెసిఆర్ గారి బయోపిక్ లో నాకు ఏం పాత్ర ఉంటుంది అని అనుకున్నాను కానీ డైరెక్టర్ నాలో కామెడీ చూడకుండా ఆర్టిస్ట్ ని చూసి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను నాకు ఇచ్చారు. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను అన్న ఫీలింగ్ కలిగింది అన్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. జాప్యం జరిగినా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ ని మెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఇటీవల సినిమాల్లో ఎక్కువగా కనపడట్లేదు హాస్య బ్రహ్మ. ఆయన అభిమానులు, తెలుగు ప్రేక్షకులు బ్రహ్మానందంని మళ్ళీ పాత రోజుల్లోలాగా ఫుల్ కమెడియన్ గా చూడాలి అని అనుకుంటున్నారు. మరి ఈ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం బ్రహ్మానందం ‘రంగమార్తాండ’, ‘పంచతంత్ర కథలు’ సినిమాలు చేస్తున్నారు.’

You might also like

Leave A Reply

Your email address will not be published.