బెంగళూరు: ప్రేమోన్మాదులు ఏదో ఒక చోట రెచ్చిపోతు అమ్మాయిల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. శిరా తాలూకాలోని దొడ్డగుళలో ప్రమోన్మాది ఒక అమ్మాయిని కత్తితో పొడిచి పరారీ అయ్యాడు.
కళ్లంబెళ్ల పోలీసుల కథనం ప్రకారం రత్నసంద్ర గొల్లరహట్టికి చెందిన పియుసి చదువుతున్న విద్యార్థిని కావ్య (20) ను ఈరణ్ణ (21) కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వెంటపడుతున్నాడు. తన ప్రేమను కాదనడంలో ఆమెపై ఈరణ్ణ కసి పెంచుకున్నాడు. సోమవారం ఉదయం కావ్య కాలేజీకి వెళ్తున్న సమయంలో ఈరణ్ణ అడ్డుకున్నాడు. తాళి కట్టేందుకు ప్రయత్నించగా యువతి అడ్డుకున్నది. ఆ వెంటనే జేబులో ఉన్న కత్తిని తీసి దాడి చేసేందుకు యత్నించగా, ఆమె పారిపోయే యత్నం చేసింది. అయినా వెంటాడి కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణాన్ని ప్రత్యక్షంగా చూసిన సహచర విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరణ్ణ పరారీలో ఉన్నాడు.