FbTelugu

సీత కన్నా శూర్పణక పాత్ర బెటర్

ట్విట్టర్ లో బాయ్ కాట్ కరీనా ఖాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ ట్యాగ్ శనివారం ఉదయం నుంచి ఊపందుకున్నది. సీత పాత్రలో కరీనా కపూర్ నటించేందుకు ఒప్పుకోవడం, భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం అభిమానులకు నచ్చడం లేదు

కొన్ని సినిమాల్లో హీరోలు లేదా హీరోయిన్లు ఊహించని విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ సంప్రదాయం గత దశాబ్ధకాలంగా కొనసాగుతున్నది. ఈ విషయం బయటకు పొక్కిన తరువాత కొందరేమో హర్షిస్తుండగా, కొద్ది మంది మాత్రమే అంతర రెమ్యునరేషన్ ఇస్తున్నారా అంటూ ఆశ్చర్యోపవడం చూశాం. కాని అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత రూపుదిద్దుకోనుండగా, ప్రముఖ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు. సీత మీద తీయనున్న సినిమాలో కరీనా కపూర్ నిర్మాతల దిమ్మ తిరిగేలా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని చిత్ర పరిశ్రమ కోడై కూస్తున్నది. ఈ వార్త చూసిన పలువురు నెటిజన్లు ఆమె హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని కామెంట్లు మొదలు పెట్టారు. ఆమె చర్య మాయని మచ్చ అంటూ బాయ్ కాట్ కరీనాఖాన్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. ఈ పాత్రకు కరీనా కంటే కంగనా రనౌత్ ను ఎంపిక చేయడం ఉత్తమమన్నారు. ఇంకొందరు ఒక అడుగుకు ముందుకేసి సీత కంటే శూర్పణక పాత్ర సరిపోతుందని హేళన చేస్తున్నారు. తాండవ్ లో నటించి భర్త సైఫ్ అలీఖాన్ హిందువుల మనోభావాల్ని కించపరిచారని, ఇప్పుడు ఈమే చేస్తుందని ట్రోల్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.