FbTelugu

బోరు బావిలో పడిన బాలుడు మృతి

మెదక్: నిన్న సాయంత్రం 5:45 ప్రాంతంలో పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల బాలుడు సాయివర్థన్ 120 లోతు బోరు బావిలో పడిపోయాడు.

ఆ బాలున్ని ప్రాణాలతో బయటకు తీసేందుకు రెస్క్యూటీం శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బోరు బావికి సమాంతరంగా ప్రొక్లైన్లతో గొయ్యి తవ్వారు. కానీ 17 అడుగుల లోతులో బాలుని మృతదేహం లభ్యమైనట్టు తెలిపారు. ఆ బోరును నిన్ననే వేసినట్టు తెలుస్తోంది. బోరు పడకపోవడంతో అలాగే వదిలేశారని తెలుపుతున్నారు.

You might also like