FbTelugu

స్ట్రెయిన్ టెన్షన్… అన్ని టిక్కెట్లు బుక్!

జకార్తా: కరోనా పుణ్యమాని నలుగురితో కలిసే పరిస్థితి లేదు. పక్కపక్కన కూర్చుని ప్రయాణం చేయడం కూడా కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతగా జాగ్రత్త పడుతున్నారో ఈ సంఘటనను బట్టి అర్థమవుతుంది.
కరోనా వైరస్ కు తోడు స్ట్రెయిన్ వైరస్ తోడవ్వడంతో గజగజ వణుకుతున్నారు. ఈ తరుణంలో స్ట్రెయిన్ వైరస్ కు భయపడి ఒక వ్యక్తి ఏకంగా విమానంలోని టిక్కెట్లన్నీ కొనుగోలు చేశాడు. జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్ జాదీ తన షల్విన్నీ ఛాంగ్ తో కలిసి బాలీకి వెళ్లాడు.

ఇందుకోసం ఆయన లయన్ ఏయిర్ గ్రూప్ నకు చెందిన బాటిక్ ఏయిర్ విమానం ఎక్కాడు. విమానంలో మిగతా ప్రయాణీకులు ఉంటే తనకు స్ట్రెయిన్ వైరస్ సోకవచ్చనే భయంతో తన రెండు టిక్కెట్లతో పాటు మిగతా టిక్కెట్లను గంపగుత్తగా కొనుగోలు చేశాడు.
ఆ ప్రకారంగానే ఆయన, ఆయన భార్య విమానం ఎక్కారు. ఈ విషయాన్ని రిచర్డ్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. విమానంలో టిక్కెట్లు అన్ని బుక్ చేసినా కూడా ప్రైవేటు జెట్ కన్నా తక్కువ ఖర్చు అయ్యిందంటూ సంబరపడ్డాడు. మొత్తానికి అనుకున్న విధంగా గమ్యస్థానం చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన పోస్టు చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.