FbTelugu

మూడు ప్రాంతాల అభివృద్ధి బాబుకు ఇష్టం లేదు: బొత్స

విశాఖపట్నం: నీచమైన బుద్ధితో మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం చంద్రబాబు అన్ని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అబద్ధాలకు పేటెంట్ బాబుకే ఉందని, శివరామకృష్ణ కమిటీ ఎమి చెప్పిదో చంద్రబాబు తెలుసుకోవాలని హితవు పలికారు. రాజధాని విషయంలో మంత్రి పి.నారాయణ కమిటీ ఆనాడు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదన్నారు.

బాబు హయాంలో ఎన్నో అక్రమాలు, నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. మా సీఎం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. శాసన మండలి ఛైర్మన్ ఆమోదం లేకుండా ఏదీ టేబుల్ మీదకు రాదన్నారు. మండలిలో టిడిపి సభ్యులు వీధి రౌడీలా వ్యవహరించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఉందా లేదో బాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు.
మేము రాజ్యాంగ బద్దంగా, న్యాయ బద్దంగా, చట్టానికి లోబడే ఏదైనా చేస్తామన్నారు. ఒక పార్టీ ఆదేశాలు ప్రకారం అమరావతి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ కి చంద్రబాబు రాసిన లేఖలో అన్ని అసత్యాలే ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే జగన్ అమలు చేస్తున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మంత్రి బొత్స అన్నారు.
ఇప్పుడు వాటిని జిల్లాలుగా చేస్తున్నారని ఆయన వివరించారు. అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిగా రాజధానిని ప్రకటించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఆవేదన చెందారని బొత్స పేర్కొన్నారు.

You might also like