FbTelugu

మూడు రాజధానులు వ్యక్తిగత నిర్ణయం కాదు: బొత్స

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన పలు బిల్లుల గురించి మాట్లాడారు.

బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని, మండలిలో గడువు ముగిసినందున బిల్లు ఆమోదం పొందినట్టేనని అన్నారు. రాజ్యాంగ బద్దంగానే ప్రభుత్వం నడుచుకుంటోందని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకే.. అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులను నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాల విభజనపై కమిటీ వేసినట్టు తెలిపారు.

You might also like