FbTelugu

అత్యధికం, అత్యల్పం రెండూ అక్కడే

* రాజస్థాన్ లో 0 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
జైపూర్: దేశంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. తాజాగా రాజస్థాన్, హర్యానాలలో ఉష్ణోగ్రత అత్యల్పంగా సున్నా డిగ్రీలకు పడిపోయింది.

అయితే వేసవిలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం జైసల్మీర్ రాజస్థాన్ లోనే ఉండడం విశేషం. ముఖ్యంగా హిమాలయాలు, పశ్చిమం నుంచి వీస్తున్న అతిశీతల గాలులతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. ప్రజలు రాత్రివేళల్లో జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.