FbTelugu

ఆ రెండు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

తెలుగు రాష్ట్రాల్లో ఓ పక్క ఎండలు దంచి కొడుతుండగా.. మరో పక్క అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం పడే సమయాల్లో చెట్లకింద ఉండవద్దని సూచించారు.

You might also like