FbTelugu

జమ్మూ ఏయిర్ పోర్టులో బాంబు పేలుళ్లు

శ్రీనగర్: జమ్మూ, కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సీట్ల సంఖ్య పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న తరుణంలో తీవ్రవాదుల అలజడులు చోటుచేసుకుంటున్నాయి.

జమ్మూ విమానాశ్రయంలో ఐదు నిమిషాల వ్యవదిలో జంట పేలుళ్లు సంభవించాయి. రెండు డ్రోన్లను ఉపయోగించి బాంబులు ప్రయోగించినట్లు భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పై కప్పులు ఎగిరిపడడంతో సిబ్బంది పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనంటూ ప్రయాణీకులు భయందోళనకు గురయ్యారు. విమానాశ్రయం భద్రతా సిబ్బంది, పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేశాయి. ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఏయిర్ ఫోర్స్ అధికారులు, మిలిటరీ అధికారులతో చర్చించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.