FbTelugu

బాలీవుడ్ అంటేనే నెపాటిజం…

బంధుప్రీతి బాలీవుడ్ సినిమాలు చూడొద్దు

బాయ్ కాట్ బాలీవుడ్ పేరుతో హోరెత్తతున్న హ్యాష్ ట్యాగ్ లు

ఇండియాలో ఏ రంగం కూడా బంధుప్రీతి, కులగజ్జికి మినహాయింపు లేదు. తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో బంధుప్రీతి (నెపాటిజం) తెరమీదికి వచ్చింది.

నెపాటిజం అంటే తమ వాళ్లకు అవకాశాలు కల్పించి, ప్రతిభతో పైకి వస్తున్న ఇతరులను అణగదొక్కడం. బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఈ ధోరణి వేళ్లూనుకున్నది. దీని మూలంగానే సుశాంత్ బలవన్మరణం చెందాడని సోషల్ మీడియా కోడై కూస్తున్నది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెపాటిజం పై తూర్పారబడుతున్నారు. ప్రముఖ నటీమణి సుస్మితా సేన్ కూడా బాధితురాలే.

బాయ్ కాట్ ఫేక్ స్టార్స్, బాయ్ కాట్ బాలీవుడ్, నెపాటిజం కిల్స్ సుశాంత్ అనే హ్యాష్ ట్యాగ్ తో హోరెత్తిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటులకు ఉన్న విలువ స్వయం కృషితో ఎదుగుతున్న నటీనటులకు లేదనే వాదన ఊపందుకున్నది. ఈ బంధుప్రీతి గజ్జి నుంచి విముక్తి పొందాలంటే ప్రతి ఒక్కరు బాలీవుడ్ సినిమాలు చూడ్డం మానేయాలని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. హాలీవుడ్, వెబ్ సిరీస్ చూడ్డం మేలని అంటున్నారు.

వీరేనా కారణం…

కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, ఖాన్స్, టీ సీరిస్ కలిసి సుశాంత్ కు  ప్రాధాన్యం లేకుండా చేశారనే విమర్శలు జోరందుకున్నాయి. సుశాంత్ నటించిన దిల్ బేచారా కాకుండా అత్యంత చెత్త సినిమా అయిన గల్లీ బాయ్స్ కు అవార్డు బహూకరించడే అతి పెద్ద ఉదాహరణ అని ఒకరు ట్వీట్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.