FbTelugu

50 ఫొటోలతో సైఫ్ బర్త్ డే వీడియో

ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ 50వ బర్త్ డే సందర్భంగా భార్య కరీనా కపూర్ 50 ఫొటోలతో వీడియో రూపొందించి సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది.

ఈనెల 16వ తేదీన సైఫ్ అలీఖాన్ 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి ప్రత్యేకంగా 3 నిమిషాల నిడివితో గుర్తుంచుకునే విధంగా వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో నటి సారా అలీఖాన్, ఇబ్రహీం, తైమూర్ అలీఖాన్ ఫొటోలు కూడా ఉన్నాయి. తన భర్తకు మధురమైన సందేశంతో ఈ వీడియో రూపొందించినట్లు తెలిపింది.

ఇంకా చెప్పాల్సింది ఏమంటే 50 సంవత్సరాలు వచ్చినా అందంగా కన్పిస్తున్నారని, ఇలాంటి జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు కరీనా పేర్కొంది.

You might also like