FbTelugu

మోదీ ఇమేజ్ కాదు… ప్రాణాలు కాపాడు: అనుపమ్ ఖేర్

ముంబయి: దేశంలో కరోనా విలయాన్ని చూసిన తల్లడిల్లిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన స్వరాన్ని మార్చారు. ఈ అల్లకల్లోలానికి ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్ర‌ధాని మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించే న‌టుడు అనుపమ్ ఖేర్ ఇప్పుడు త‌న గొంతు మార్చడం చర్చనీయాంశంగా మారింది. భారత్ కు ఇతర దేశాల్లో ఇమేజ్ సృష్టించడం కంటే ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడటం ముఖ్యమని హితవు పలికారు. దీనిని ప్రభుత్వం అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రతిరోజూ కరోనా కార‌ణంగా 4 వేల మంది వ‌ర‌కూ ప్రాణాలు కోల్పోతుండడం శోచనీయం. ప్రతిరోజూ నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నా పట్టింపు లేదా అని ప్రశ్నించారు. ఆరోగ్య సంక్షోభాన్ని చ‌క్క‌దిద్ద‌డంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అనుపమ్ ఖేర్ తూర్పారబట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.