FbTelugu

బాయ్స్ లాక‌ర్ రూం.. అశ్లీలత‌కు చిరునామా

బాయ్స్ లాక‌ర్స్ రూమ్‌- ఇప్పుడు దేశవ్యాప్తంగా స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారిన ప‌దమిది. అవును స‌భ్య స‌మాజం త‌లదించుకునే స్థాయిలో 14-15 పిల్ల‌లు క‌లిసి ఆన్‌లైన్ వేదికగా సాగిస్తున్న అశ్లీల చ‌ర్చ‌కు కేరాఫ్ చిరునామా ఆ గ‌ది.

గ‌ది అంటే ఇదేదో ఇంటిలోని గ‌ది కాదు. ఇన్‌స్టాగ్రాంలో ప్ర‌త్యేక గ్రూపు పెట్టి పోర్న్‌కు అల‌వాటు ప‌డ్డ పిల్ల‌లు దానిపైనే ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు చ‌ర్చ‌కు తెర‌లేపారు. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ బాయ్స్ లాక‌ర్ రూం భాగోతం దేశ‌వ్యాప్తంగా విద్యావ‌ర్గాల్లో చ‌ర్చ‌కు తెర‌లేపింది. పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రుల బాధ్య‌త ఎలా ఉండాలో మ‌రోమారు గుర్తు చేసింది.

ఇంత‌కీ ఆ గ‌దిలో ఏముంది….?
లాక్‌డౌన్ కార‌ణంగా పిల్లా పెద్దా అందరూ ఇళ్ల‌కే ప‌రిమిత‌య్యారు. ఈ స‌మ‌యంలో ఎక్కువ‌గా ఆన్‌లైన్ వేదిక‌ల‌పైనే స‌మ‌యం గ‌డుపుతున్నారు. ఫేజ్‌బుక్‌, వాట్స‌ప్‌, ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రాం, స్నాప్‌చాట్‌, టిక్‌టాక్….. ఒక‌టేమిటి ప్ర‌పంచంలో ఉన్న సామాజిక మాధ్య‌మాల‌న్నీ వినియోగిస్తూ కాల‌క్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల‌కు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉండ‌టంతో, ఆ సామాజిక మాధ్య‌మాలకే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదే స‌మ‌యంలో అశ్లీల సందేశాలు, వీడియోలు షేర్ చేసుకుంటూ వాటికి బానిస‌ల‌వుతున్నారు.

కానీ దేశ‌రాజ‌ధానిలోని ఒక పాఠశాల‌లో చ‌దివే విద్యార్థులు ఇంకా శృతి మించారు. ఇన్‌స్టాగ్రాం వేదిక త‌ర‌గ‌తిలోని బాలుర‌తో క‌లిసి ఒక ప్రైవేటు గ్రూపు ఏర్పాటు చేశారు. అందులో పోర్న్ వీడియోలు షేర్ చేసుకుని చూడ‌టం ప్రారంభించారు. ఇదే స‌మ‌యంలో కొంద‌రు విద్యార్థులు త‌ర‌గ‌తి గ‌దిలోని అమ్మాయిల గురించి అస‌భ్య కామెంట్లు చేసుకోవ‌డం, వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ వీడియోలు, చిత్రాల‌కు త‌గిలించ‌డం చేశారు. ఈ గ్రూపులో ఇటీవ‌ల ఒక బాలుడ్ని యాడ్ చేయ‌డంతో, అక్క‌డ జ‌రుగుతున్న చ‌ర్చ‌, తోటి విద్యార్థినుల చిత్రాలు చూసి భ‌య‌మేసింది. వెంట‌నే చిత్రాలు, గ్రూపు వివ‌రాల‌ను బాలిక‌ల తల్లిదండ్రుల‌కు తెలియ‌జేశాడు. వారు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. అశ్లీల ఫొటోలు పెడుతున్న విద్యార్థుల‌ను, గ్రూపు అడ్మిన్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సంఘట‌న ఢిల్లీలోనే కాదు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు తెర‌లేచింది. పిల్ల‌ల‌కు ఫోన్లు ఇచ్చి ప‌ర్య‌వేక్ష‌ణ మ‌రిస్తే జ‌రిగే ప‌ర్య‌వ‌సానాల‌కు అద్దం ప‌ట్టింది. విద్యార్థులు టెక్నాల‌జీ వినియోగాన్ని పెంచుకోవాల‌ని చెబుతుండ‌గా అది ప‌క్క‌దారి ప‌డుతుండ‌టం, విప‌రీత పోక‌డ‌ల‌కు దారి తీస్తుండ‌టం స‌ర్వ‌త్రా ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. ఏకంగా 14-15 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లు పోర్న్ వీడియోల‌కు బానిస‌ల‌వుతున్న తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ లేక‌పోవ‌డం కార‌ణంగా ఎంత‌టి విప‌రిణామాల‌కు దారితీస్తోంది తెలుస్తోంది. విద్యార్థుల‌కు వేరొక యాక్టివిటీస్ మీద దృష్టి మ‌ళ్లిస్తే ఇలాంటి సంఘ‌ట‌న‌లు వెలుగు చూడ‌వ‌ని విద్యావేత్త‌లు చెబుతున్నారు.
ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా దేశంలో వ‌ర్క్ ఫ్రం హోంకు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అదే స‌మ‌యంలో స్కూళ్ళు, కాలేజీలు మూత‌ప‌డి పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ విద్య అందిస్తున్నారు. కానీ స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగే కొద్దీ అశ్లీల మార్గాల‌కు దారి తీస్తోంది. జూమ్ యాప్ వినియోగిస్తున్న క్ర‌మంలో అశ్లీల వీడియోలు, నోటిఫికేష‌న్స్ వ‌స్తున్నాయ‌ని ఇప్ప‌టికే ఫిర్యాదులు ఉన్నాయి. దీనివినియోగం శ్రేయ‌స్క‌రం కాద‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పంది. కానీ చాలాచోట్ల కాలేజీల్లో జూమ్ యాప్ వాడుతూ పాఠాలు బోధిస్తున్నారు.
ప్ర‌స్తుత లాక్‌‌డౌన్ స‌మ‌యంలో పోర్న్ సైట్స్‌కు ఏకంగా 95శాతం ట్రాఫిక్ పెరిగింద‌ట‌. వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న ప్ర‌తి ఇద్ద‌రీలో ఒకరు పోర్న్ వీడియోలు చూస్తున్నార‌ని ఒక స‌ర్వేలో వెలుగు చూసింది. ఇలాంటి స‌మ‌యంలో విద్యార్థుల ప‌రంగా అశ్లీల గ్రూపులు బ‌య‌ట‌ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

You might also like