FbTelugu

ఒంగోలులో బోగస్ కరోనా ఆసుపత్రి

ప్రకాశం: ఒంగోలు నగరంలో ఓ బోగస్‌ ఆసుపత్రి పై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల దాడితో ఆసుపత్రి గుట్టురట్టైంది. ఆదిత్య ఆసుపత్రి పేరిట వైద్యశాలను ఓ ఫార్మసీ విద్యార్థి నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఫిర్యాదు రావడంతో టాస్క్‌ ఫోర్స్‌ తనిఖీలు చేపట్టడంతో బాగోతం వెలుగు చూసింది. బోగస్ ఆసుపత్రిలో కరోనా రోగులు ఉండడంతో కంగుతిన్నారు. వారినందరినీ ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. బోగస్ ఆసుపత్రి ని సీజ్ చేసి, దాన్ని నిర్వహిస్తున్న శ్రీనివాస రెడ్డిపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు నిందితుడు శ్రీనివాసరెడ్డి ని విచారిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.