FbTelugu

సూట్ కేసులో యువకుని మృతదేహం

* మద్యం మత్తులో స్నేహితులే హతం!
హైదరాబాద్: ఓ యువకున్ని అతి దారుణంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కి పడేసిన ఘటన నగరంలోని రాజేంద్రనగర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకారం.. చాంయాణగుట్టకు చెందిన రషీద్‌ అనే యువకుడు రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు రషీద్ ఇద్దరు స్నేహితులు(ఫయాజ్, ఫిరోజ్‌)ల ను విచారించగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. రెండ్రోజుల క్రితం ముగ్గురూ మద్యం మత్తులో గొడవ పడ్డారు. మాటమాట పెరిగి గొడవ ముదరడంతో రిజాయ్‌ను మరో ఇద్దరు కలిసి చంపేసి శవాన్ని ఓ సూట్‌కేసులో పెట్టి రాజేంద్రనగర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌ వద్ద పడేనట్టు నిందితులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.