FbTelugu

1948 నాటి మృతదేహం వెలికితీత

అడిలైడ్: భారత దేశంలో అయితే ఐదేళ్ల క్రితం మృతదేహం వెలికితీయాలంటే సవాలక్ష ప్రశ్నలు వేస్తారు. విదేశాల్లో మాత్రం అలా ఉండదు. నిజాన్ని నిగ్గుతేల్చేందుకు ఎన్ని దశాబ్ధాలు అయినా సరే మృతదేహాన్ని బయటకు తీసి పరీక్షిస్తారు.
ఆస్ట్రేలియాలో ఏడు దశాబ్ధాల క్రితం అనగా 1948, డిసెంబర్ లో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆడిలైడ్ సమీపంలోని సోమర్టన్ బీచ్ లో 1948, డిసెంబర్ 1వ తేదీన ఒక వ్యక్తి చనిపోయారు. గుర్తు తెలియని శవం కావడంతో ప్రభుత్వమే దహన సంస్కారాలు నిర్వహించింది.

అతని చావు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అతని సమాధిపై గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారని పలకం పెట్టడంతో ఆ వ్యక్తి ఆనవాళ్లు కనిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. డిఎన్ఏ విధానంలో ఆయన వివరాలు కనుగొనేందుకు శవ పేటికలో ఉన్న మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. శవంతో పాటు సూట్ కేసు లభ్యం కావడంతో ఆడిలైట్ పోలీసు స్టేషన్ లోనే ఇప్పటికి భద్రపరిచారు.
ఆ సూట్ కేసు తెరిచి చూడగా ప్రేమ లేఖలు ఉన్నాయి. భగ్న ప్రేమికుడు కావచ్చని ప్రజలు చర్చించుకోగా, గూడఛారి అని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ఒక కాగితంపై ఉణ్న ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆరా తీయగా, జెస్సీ అనే మహిళకు చెందిందని తేలింది. జెస్సీని విచారించగా తనకేమి తెలియదని చెప్పడంతో విచారణ ఆగిపోయింది. ఆమెకు ఒక కుమారుడు ఉండడంతో అతని డిఎన్ఏ తో సరిపోల్చాలని పోలీసులు నిర్ణయించారు. డిఎన్ఏ సేకరణ ద్వారా చనిపోయిన వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎలా చనిపోయాడనేది తెలుసుకుంటామని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.