FbTelugu

లోకేష్ పై దాడికి యత్నించడంతోనే ఘర్షణ: బీద రవిచంద్ర

అమరావతి: మండలిలో లోకేష్ ను లక్ష్యంగా చేసుకొని వౌసీపీ నేతలు దాడికి యత్నించడంతోనే ఘర్షణ మొదలైందని తెదేపా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. మండలిలో ఘర్షణపై ఇవాళ ఆయన మీడియాతో పలు విషయాలను వెల్లడించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు తెదేపా సానుకూలమని అన్నారు.

మండలిలో ఘర్షణపై వీడియో పుటేజీని బయట పెట్టాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. వైసీపీ మంత్రులే లోకేష్ వైపు వచ్చారని, టీడీపీ సభ్యులెవరూ వాళ్లవైపు వెళ్లలేదని అన్నారు. దీనికి డిప్యూటీ చైర్మన్ ప్రత్యక్ష సాక్షి అని అన్నారు.

అభ్యంతరకరంగా దూషించి, అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ చైర్మన్ ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. మండలిలో లోకేష్ ఫోటోలు తీయలేదన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్డీఏ రద్దు బిల్లులు సెలక్ట్ కమిటీ వద్ద ఉన్నాయన్నారు. మళ్ళీ ఆ బిల్లులను ప్రవేశ పెట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే అన్నారు. రెండు బిల్లులు తప్పితే ఏ బిల్లుకూ తెదేపా వ్యతిరేకంగా కాదన్నారు.

You might also like