FbTelugu

బోటు మునిగి 50 మంది గల్లంతు

ట్యునిస్: వలసదారులతో వస్తున్న పడవ ట్యూనిషియా తీరంలో మునిగిపోవడంతో సుమారు 50 మంది గల్లంతు అయ్యారు. మునిగిపోతున్న 33 మందిని సమీపంలో ఉన్న చమురు సంస్థ ఉద్యోగులు కాపాడి తీరానికి చేర్చారు.

ఎస్ ఫాక్స్ తీరంలో ఈ ఘటన చోటు చేసుకున్నదని ట్యూనిషియా రక్షణ శాఖ వెల్లడించింది. ప్రభుత్వం కథనం ప్రకారం లిబియాలోని జవారా రేవు నుంచి బయలుదేరిన ఈ పడవలో 90 మంది వరకు వలసదారులు ఉన్నారు. యురప్ దేశాలకు వెళ్లాలనుకునే అక్రమ వలసదారులు లిబియా మీదుగా ప్రమాదకరమైన మధ్యదారా సముద్రమార్గం ద్వారా చేరుకుంటున్నారు. అప్పుడప్పుడు ఈ మార్గంలో ప్రమాదాలు జరగడం, చనిపోవడం సర్వసాధారణం అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సురక్షితంగా బయటపడిన 33 మంది బంగ్లాదేశీయులు అని అంతర్జాతీయ వలసదారుల సంస్థ పేర్కొంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.