FbTelugu

బోటు మునిగినా… నలుగురు సురక్షితం…

చెన్నై: బంగాళాఖాతంలో బోటు మునిగిపోయింది. అయినా నాలుగు రోజుల పాటు దానిపై బిగపట్టుకు కూర్చున్నారు. ఈలోపు దాని పక్కనుంచే వెళ్లిన వాణిజ్య నౌక సిబ్బంది ముంబైలోని ఎమ్మార్ సీసీ కి సమాచారం అందించంతో బతికి బయటపడ్డారు.
చెన్నైకి తూర్పున 170 నాటికల్ మైళ్ల దూరంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. శ్రీలంకలోని త్రింకోమాళికి చెంది ఆరుగురు మత్స్యకారులు చేపల కోసం బయలుదేరారు. అలల తాకిడికి బోటు బోర్లా పడింది. దానిపైనే నలుగురు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

నాలుగో రోజు చెన్నై నుంచి విశాఖకు వెళ్తున్న వైఎం సమ్మిట్ వాణిజ్య నౌక సిబ్బందికి వీరు కన్పించారు. బోటు బొల్తాపడిన విషయాన్ని, దానిపై నలుగురు ఉన్న సమాచారాన్ని ముంబైలోని ఎమ్మార్ సీసీ కి సమాచారం ఇచ్చారు. వారు చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. వెంటనే కోస్టు గార్డ్ సిబ్బంది బయలుదేరి వారిని రక్షించి తీసుకుని వచ్చారు. ఈ విషయాన్ని శ్రీలంక రాయబారికి సమాచారం ఇచ్చారు.

You might also like