FbTelugu

పడవ బోల్తా.. 7గురు మృతి

జైపూర్: కోటా జిల్లాలోని చంబల్ నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు చనిపోగా, మరో 14 మంది గల్లంతయ్యారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
గల్లంతైన వారిని రక్షించేందుకు వెంటనే గజ ఈతగాళ్లను వెంటనే రంగంలోకి దించారు. ఘటనా ప్రాంతానికి చేరుకున రెస్క్యూ బృందాలు ఇప్పటికే ఏడుగురు మృతదేహాలను బయటకు తీశారు.

మిగతవారి కోసం గజ ఈతగాళ్లతో నదిలో వెదుకులాట ప్రారంభించారు. అయితే పడవలో పరిమితికి మించి జనాలకు ఎక్కించుకోవడం, మోటార్ సైకిళ్లను తీసుకువెళ్తుండడంతో బరువు పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.

అధిక బరువుతో వస్తున్న పడవ మునిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనపై సీఎం అశోక్ గెహ్లట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయం నిధి నుంచి సాయం చేస్తామని గెహ్లట్ ప్రకటించారు.

You might also like