FbTelugu

ఈనాడులో నిర్భంద సెలవులు

ఇక నుండి సిబ్బందికి కొద్ది రోజులే ఉద్యోగం

అర్ధరాత్రి నోటీసుల జారీ..

హైదరాబాద్: కరోనా ముసుగులో పత్రికా యాజమాన్యాలు తాము అనుకున్న పనులను నిర్విఘ్నంగా చక్కబెడుతున్నాయి. ఆదాయం రావడం లేదనే సాకు చూపిస్తూ ఉద్యోగులను ఇంటికి పంపించే కుట్రలకు తెరలేపారు.

దశాబ్ధాలుగా పత్రికలను నడిపిస్తూ వందల కోట్ల రూపాయలు ఆర్జించిన సంస్థలు గత రెండు నెలలుగా బీద అరుపులు అరుస్తున్నాయి. మరి ఇన్ని రోజులు సంపాధించిన ఆదాయం ఎక్కడకు పోయిందో యాజమాన్యాలకే తెలియాలి మరి.

ఈనాడు ఉద్యోగులపై కత్తి వేలాడుతోందంటున్నారు. కరోనా నేపథ్యంలో అడ్వర్టైజ్ మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో ఉద్యోగులకు కొద్ది రోజుల పని, వేతనం మాత్రమే ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఈనాడు యాజమాన్యం నోటీసులు జారీ చేసిందని ఉద్యోగులు చెబతున్నారు.

ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో కొందరికి రెండు మూడు రోజుల పని మాత్రమే ఇస్తామని  నోటీసులో పేర్కొంది. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా తెలుగు పత్రికల్లో తొలి స్థానంలో ఉన్న ఈనాడు దినపత్రిక నేడు ఆదాయం రాక కుదేలయిందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం ఈనాడు యాజమాన్యంపై భగ్గుమంటున్నారు. ఈ విధానం పొమ్మనలేక పొగ పెట్టినట్లేనని అంటున్నారు. పదిహేను రోజుల వేతనంతో మేము ఎలా బతకాలి, మా కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

eenadu management

You might also like