FbTelugu

రక్తదానం… కిలో చికెన్ ఫ్రీ

ముంబై: రక్తాన్ని దానం చేస్తే ఒక కిలో చికెన్ ఉచితంగా ఇస్తానని చేస్తున్న ప్రచారం సత్పలితాలను ఇస్తున్నది. తమ ఆహారపు అలవాట్లను బట్టి కిలో చికెన్ లేదా పన్నీరు తీసుకువెళ్లవచ్చని ప్రకటించారు.
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ సమాధన్ సదా సర్వాంకర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. లోయర్ పరేల్ కేఈఎం ఆసుపత్రి భాగస్వామ్యంతో సమాధాన్ ఈ నెల 13న రాజభౌ సాల్వి గ్రౌండ్ లో రక్త దాన శిబిరం నిర్వహిస్తున్నారు.

ఇందులో పాల్గొనాలని అనుకునేవారు తమ పేర్లను శివసేన శాఖ 194 వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
పాలు, ఫౌల్ట్రీ ఉత్పత్తులు రోగ నిరోధక శక్తిని పెంచేవే కాకుండా ప్రొటీన్, విటమిన్లకు మూలం అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్ సైట్ లో చదివానన్నారు. రక్త సరఫరా క్షీణించిన నేపథ్యంలో స్వచ్చందంగా రక్తదానం చేయాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పిలుపునిచ్చారన్నారు. ఉద్దవ్ పిలుపు మేరకు రక్తదాన శిబిరం నిర్వహించడంతో పాటు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం చికెన్ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించానని కార్పొరేటర్ సమాధన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.