FbTelugu

యువతి నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్

గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థులు తోటి విద్యార్థిని నగ్నచిత్రాలతో బెదిరింపులకు పాల్పడిన ఘటన మరువక ముందే.. నరసరావుపేటలో యువతుల నగ్న చిత్రాలతో ఓ యువకుడు బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగాల పాడుకు చెందిన శివానంద్ అనే యువకుడు(నిందితుడు) యువతుల నగ్న చిత్రాలు రహస్యంగా తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. అతనికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా సహకరిస్తుండడంతో నరసరావుపేటకు చెందిన ఓ బాధిత యువతి ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ యువకునిపై, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.