FbTelugu

బ్లాక్ ఫంగస్… ఇళ్లే అమ్ముకున్నాడు!

గాంధీనగర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ పలువురు బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన ఒక వ్యక్తి ప్రాణం కాపాడుకునేందుకు ఉన్న ఇంటిని అమ్మేసుకున్నాడు.

ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే బ్లాక్ ఫంగస్ వ్యాధితో రెండు వేల మంది బాధపడుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన విమల్ అనే వ్యక్తి చికిత్స తీసుకుని కోలుకున్న తరువాత ఇంటికి వెళ్లాడు. ఆ వెంటనే బ్లాక్ ఫంగస్ రావడంతో ఐదు నెలలుగా దానిపై పోరాడుతున్నాడు. విమల్ భార్య చాందిని మాట్లాడుతూ, అహ్మదాబాద్ లో ఉంటామని, గతేడాది నవంబర్ లో పాజిటివ్ నిర్థారణ అయ్యిందని తెలిపింది. చికిత్స సమయంలో ఆక్సిజన్ తో పాటు స్టెరాయిడ్స్ ఇచ్చారన్నారు. స్టెరాయిడ్స్ విపరీతంగా ఉపయోగించడం మూలంగా ముక్కులో బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు వైద్యులు తొలుత గుర్తించారు. ఆనంద్ మెడికల్ కాలేజీలో చేరగా ఆపరేషన్ చేశారని, ఆత రువాత కంటికి చేరుకున్నదని తెలిపింది. ఇప్పుడు మెదకు చేరుకోవడంతో న్యూరో సర్జరీ చేయాలని వైద్యులు అంటున్నారన్నారు.

ఇప్పటి వరకు 6 సర్జరీలు నిర్వహించారని తాజాగా ఏడో సర్జరీకి సిద్ధమవుతున్నామని తెలిపింది. డబ్బులు లేకపోవడంతో ఉన్న ఇంటిని విక్రయించినట్లు తెలిపింది. వైద్యం ఖర్చుల కోసం ఇప్పటి దాకా రూ.41 లక్షలు ఖర్చు చేశామని మెదడు సర్జరీ కోసం మరో రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. కోలుకున్నాడని ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో వైద్యులు మరో బాంబు పేల్చారన్నారు. మెదడుకు సోకినందుకు ఆపరేషన్ చేయాలంటున్నారని చాందిని కన్నీటి పర్యంతమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.