FbTelugu

ఆరోగ్య శ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్

అమరావతి: ఆరోగ్య శ్రీ పరిధిలోని బ్లాక్ ఫంగస్ చేర్చినట్లు ఏపి డిప్యూటీ సిఎం ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు.

పాజిటివ్ రోగుల గుర్తింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వే నిర్వహిస్తున్నామని, గ్రామాల్లో పగడ్బంధీగా సర్వే జరుగుతోందని మంత్రి నాని అన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నామన్నారు. కర్ఫ్యూ కారణంగా రాష్ట్రంలో కేసులు తగ్గుమఖం పడుతున్నాయన్నారు. పదివేల ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచామన్నారు. ఈ నెల చివరికి రెండు వేలకు పైగా ఆక్సిజన్ కాన్ సెంట్రేటర్లు రాబోతున్నాయన్నారు. అన్ని ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ కు వాడే మందులు సమకూర్చాలని సిఎం ఆదేశించారని ఆళ్ల నాని వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.