FbTelugu

అనంతపురంలో బ్లాక్ ఫంగస్ కేసులు

అనంతపురం: జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు కలకలం రేపుతోంది. జిల్లా వాసుల్లో ఇద్దరికి బ్లాక్ ఫంగస్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాధితులకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా యంత్రాంగం జాగ్రత్త వహిస్తోంది. ముగ్గురు హిందూపురం వాసుల్లోనూ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన తరువాత రెండు వారాల తరువాత కూడా కొందరిలో తగ్గడం లేదు.

వీరికి స్టెరాయిడ్స్ ఇచ్చి వ్యాధి తగ్గించడం మూలంగా బ్లాక్ ఫంగస్ లాంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, బిపి, గుండె వ్యాధులు ఉన్నవారు అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. పాజిటివ్ రోగుల్లో స్టెరాయిడ్‌లు వాడిన బాధితుల్లో టెన్షన్‌ నెలకొంది. కరోనా తో పాటు బ్లాక్ ఫంగస్ కేసులను కూడా ఏపి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లో చేర్చింది. అనంతపురం తో పాటు గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఫంగస్ కేసులు వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఫంగస్ బారిన పడి ఒకరు మృతిచెందారు కూడా. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈ.ఎన్.టి హాస్పిటళ్లకు పలువురు పరుగులు తీస్తుండడంతో రద్దీ ఏర్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.